DAPPIGONINA VAANIPAI NEETIN

TELUGUENGLISH
పల్లవి : దప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే
ఎండియున్న భూమిపై జలముల్ – ప్రవహింప జేయునాయనే

1. వడిగల జలములలో దారిన్ – నిర్మించును ఆ ప్రభువే
అడవులలో రాజబాటలను – స్థాపించును మన ప్రభువే
|| దప్పిగొనిన ||

2. మన సంతతిపై ఆత్మన్ – కుమ్మరించును మన ప్రభువే
తన ఆత్మలో వారిని నింపి – నిర్మించును సంఘముగా
|| దప్పిగొనిన ||

3. నీటికాలువలయొద్ద – నిరవంజి చెట్లవలె
గడ్డిలో యెదుగునట్లు – వారు వర్ధిల్లెదరు
|| దప్పిగొనిన ||

4. కరుణాపీఠము పై నుండి – మాట్లాడెను మన దేవుడే
పరలోకము నుండి స్వరమున్ వినిపించెను మన దేవుడే
|| దప్పిగొనిన ||

5. ఆకాశము తెరువబడగా – మాట్లాడెను మన దేవుడే
ఒక శబ్దముచే తన సుతుని – ఘనపరచెను మన దేవుడే
|| దప్పిగొనిన ||

6. మందసమున్ దేవుని ప్రజలు – మందిరమందుంచగనే
మందిరమున్ క్రమ్మెను ప్రభుని – తేజోమహిమంతటను
|| దప్పిగొనిన ||

7. తన ప్రజలెల్లప్పుడు క్రీస్తున్ – సేవింతురు హర్షముతో
దిన దినము దేవునికొల్చి – హల్లెలూయ పాడెదరు
|| దప్పిగొనిన ||
Pallavi : Dappi gonina vaanipai neetin kummarinchunu
aa prabhuve – endiyunna bhoomipai jalamul –
pravahimpa jeyunaayane

1. Vadigala jalamulalo daarin – nirminchunu aa prabhuve
adavulalo raaja baatalanu – staapinchunu
mana prabhuve
“Dappi”

2. Mana santatipai thana atman – kummarinchunu mana
prabhuve thanaaatmatho vaarini nimpi nirminchunu
sanghamugaa
“Dappi”

3. Neeti kaaluvala yodda – niravanji chetla vale
gaddilo yedugu natlu – vaaru vardhilledaru
“Dappi”

4. Karunaa peetahmupai nundi maatlaadenu mana
devude paralokamunundi svaramun vinipinchenu
mana devude
“Dappi”

5. Aakaashamu theruvabadagaa – maatlaadenu
mana devude – oka shabhdamuche thana
sutuni – ghanaparachenu mana devude
“Dappi”

6. Mandasamun devuni prajalu mandiramandunchagane
mandiramun krammenu prabhuni
thejomahi manthatanu
“Dappi”

7. Thana prajalellapudu kristun – sevinthuru
harshamutho – dina dinamu devuni kolchi –
Halleluya paadedaru
“Dappi”